Cricket: టీ20లో మొదటి 6 ఓవర్లే విజయాన్ని నిర్ణయిస్తాయి: రైనా

  • కోహ్లీ నమ్మకముంచడం వల్లే జట్టులో స్థానం సంపాదించగలిగాను
  • కోహ్లీ కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తాడు
  • ఓపెనింగ్ ధాటిగా ఉండాలి

టీ20 మ్యాచ్ లో తొలి ఆరు ఓవర్లే జట్టు జయాపజయాలను నిర్ణయిస్తాయని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సురేష్ రైనా తెలిపాడు. జొహొన్నెస్ బర్గ్ లో నేటి రాత్రి సౌతాఫ్రికాతో ఫైనల్ టీ20 జరుగనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తొలి ఆరు ఓవర్లలో ధాటిగా ఆడిన జట్టు లేదా, తొలి ఆరు ఓవర్లు పరుగులను నియంత్రించి, వికెట్లు తీసిన జట్టునే విజయం వరిస్తుందన్నాడు.

అందుకే బ్యాటింగ్ చేసిన జట్టు తొలి ఓవర్లలో ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తుందని చెప్పాడు. ఇక తనపై కెప్టెన్ కోహ్లీ నమ్మకముంచడంతోనే తాను జట్టులో స్థానం దక్కించుకోగలిగానని అన్నాడు. కోహ్లీ చివరి బంతి వరకు పోరాడుతాడని, ఈ క్రమంలో కొన్ని సార్లు కఠినంగా వ్యవహరిస్తాడని రైనా తెలిపాడు. తొలి రెండు టీ20ల్లో బౌలర్లు రాణించారని చెప్పాడు. ఫినిషింగ్ బాగుంటే రెండో టీ20లో విజయం సాధించేవారమని అభిప్రాయపడ్డాడు.

Cricket
team india
suresh raina
  • Loading...

More Telugu News