lupus nephritis: లూపస్ వ్యాధిపై పరిశోధన.. భారత సంతతి శాస్త్రవేత్త చంద్రమోహన్ కు రూ.3.9 కోట్ల గ్రాంటు!

  • 3.9 కోట్ల రూపాయల గ్రాంటును మంజూరు చేసిన లూపస్‌ పరిశోధక కూటమి (ఎల్‌ఆర్‌ఏ) 
  • ‘లూపస్‌ నెఫ్రైటిస్‌’ అనే మూత్రపిండ సంబంధిత వ్యాధికి అందుబాటులో లేని చికిత్స
  • భారత సంతతి శాస్త్రవేత్త చంద్రమోహన్‌ తో కూడిన ముగ్గురు పరిశోధకుల బృందం పరిశోధన

అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్తకు 3.9 కోట్ల రూపాయల గ్రాంటును  లూపస్‌ పరిశోధక కూటమి(ఎల్‌ఆర్‌ఏ) మంజూరు చేసింది. ప్రమాదకరమైన లూపస్‌ వ్యాధికి సరికొత్త చికిత్సను అభివృద్ధి చేసే దిశగా విస్తృత పరిశోధనలు చేపట్టేందుకుగాను ఈ నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.

‘లూపస్‌ నెఫ్రైటిస్‌’ అనే మూత్రపిండ సంబంధిత వ్యాధి బారినపడిన వ్యక్తుల్లో రోగ నిరోధక వ్యవస్థ స్వీయ ఆరోగ్యకణాలపై దాడి చేస్తుంది. ఈ వ్యాధి చికిత్సను భారత సంతతి శాస్త్రవేత్త చంద్రమోహన్‌ తో కూడిన ముగ్గురు పరిశోధకుల బృందం అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. దీనికి ప్రభావవంతమైన చికిత్సలు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. ఈ వ్యాధి నిరోధానికి చంద్రమోహన్‌ బృందం ప్రత్యేకమైన చికిత్స మార్గాలను అభివృద్ధి చేయనుంది.

  • Loading...

More Telugu News