jubair ali khan: రూ. కోటి ఇవ్వాలంటూ మహిళను బెదిరించిన బిగ్ బాస్ పోటీదారుడు

  • స్వచ్చంద సంస్థకు చెందిన మహిళకు బెదిరింపులు
  • పాకిస్థాన్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్
  • జుబేర్ అలీఖాన్ ను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్-11లో పోటీదారుడు అయిన జుబేర్ అలీఖాన్ డబ్బు కోసం ఓ మహిళను బెదిరించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అండర్ వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీం అనుచరుడినంటూ ముంబై బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా ప్రతినిధిని అతను బెదరించాడు.

పాకిస్థాన్ నుంచి తాను మాట్లాడుతున్నానని... రూ. కోటి ఇవ్వాలని ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, సదరు బాధితురాలు ముంబై క్రైమ్ బ్రాంచ్ కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేయగా... ఆ బెదిరింపులు చేసింది జుబేర్ అలీఖాన్ అని తేలింది. దీంతో, అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేశారు. 

jubair ali khan
big boss
dawood ibrahim
  • Loading...

More Telugu News