Kamareddy District: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ సీఐ.. బదిలీ చేసిన ఉన్నతాధికారులు!

  • తాగి నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న ధర్పల్లి సీఐ డి.కృష్ణ
  • సీఐ నంటూ తనిఖీ సిబ్బందిపై ఆగ్రహం
  • కేసు నమోదు చేయాలని ఆదేశించి, ట్రాన్స్ ఫర్ చేసిన ఉన్నతాధికారులు

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో దొరికిపోయిన సీఐ, సహోద్యోగులపై వీరంగమేసి.. పర్యవసానంగా  హెడ్ క్వార్టర్ కు బదిలీ అయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఆ ప్రాంత పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి సీఐగా పనిచేస్తున్న డి.కృష్ణ మద్యం తాగి నిజామాబాద్ నుంచి కామారెడ్డికి తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.

 దీంతో తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఆయనను ఆపి తనిఖీ చేయగా తాగినట్టు తేలింది. దీంతో తాను సీఐనంటూ తనిఖీలు నిర్వహించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సై నాగరాజు ఉన్నతాధికారులను సంప్రదించగా, చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను ధర్పల్లి నుంచి హెడ్ క్వార్టర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేశారు. 

Kamareddy District
ci arrest
drunk and drive
  • Loading...

More Telugu News