elections: ఏప్రిల్ 2తో చిరంజీవి సహా ఆరుగురు తెలుగు ఎంపీల పదవీ కాలం పూర్తి!

  • ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపీల పదవీకాలం పూర్తి
  • మార్చి 23న తెలుగు రాష్ట్రాల్లో ఎంపీల ఎన్నికలు
  • 16 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన జాతీయ ఎన్నికల సంఘం

 ఏప్రిల్‌ 2తో తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ఎంపీల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణ రాజ్యసభ సభ్యులు దేవేందర్‌ గౌడ్‌, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డి లతో పాటు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యులు చిరంజీవి, రేణుకా చౌదరి, సీఎం రమేష్‌‌‌ ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో 16 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా మార్చి 23న తెలంగాణ, ఏపీల్లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

elections
parliment
rajya sabha
mp's
  • Loading...

More Telugu News