Andhra Pradesh: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఐపీఎస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

  • ఇంటెలిజెన్స్ చీఫ్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐపీఎస్‌లు
  • పోలీసు వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నాం
  • అధికారులపై రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేయకుండా ఉండాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఐపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌పై ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్‌లు తప్పుబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసు వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నామని వ్యాఖ్యానించారు. అధికారులపై రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేయకుండా ఉండాలని అన్నారు.

కాగా, కొంతమంది పోలీసు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ, విజయసాయిరెడ్డి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తావించిన అధికారుల పేరులో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు పేరు కూడా ఉంది.   

Andhra Pradesh
ips
vijaya sai reddy
  • Loading...

More Telugu News