teacher: విద్యార్థినిని చితక్కొట్టిన టీచర్‌.. కేసు నమోదు చేసిన పోలీసులు!

  • పఠాన్‌చెరులో ఘటన
  • మంజీరా హై స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోన్న విద్యార్థిని 
  • చిన్నారి వీపుపై గాయాలు

ఎల్‌కేజీ విద్యార్థినిని ఓ టీచర్ చితక్కొట్టిన ఘటన హైదరాబాద్ శివారులోని పఠాన్‌చెరులో చోటు చేసుకుంది. తాజాగా ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. తమ కూతురు స్థానికంగా ఉండే మంజీరా హై స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోందని, చెప్పిన మాట వినడం లేదనే కారణంతో ఆమెను టీచర్ వీపువాచేలా కొట్టారని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. సదరు టీచర్‌పై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. 

teacher
student
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News