Viral Videos: యూనిఫామ్‌ ధరించలేదని టాక్సీ డ్రైవ‌ర్‌తో గుంజీలు తీయించి.. ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసిన నేత!

  • ముంబయిలో ఘటన
  • బుద్ధి రావాలనే అలా చేశా: ఎంఎన్‌ఎస్ నేత నితిన్ నంద్‌గోకర్ 
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ట్యాక్సీ డ్రైవర్‌ యూనిఫాం ధరించలేదని, డ్రైవింగ్ బ్యాడ్జీ కూడా లేదని ఓ నేత అతడితో గుంజీలు తీయించిన ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడ్డ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) నేత నితిన్ నంద్‌గోకర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... తాను ముంబయి విమానాశ్రయంలో ఆ డ్రైవర్‌ను గుర్తించానని తెలిపారు. ఆ డ్రైవర్ వద్ద డ్రైవింగ్‌కు సంబంధించిన బ్యాడ్జీలేదని, యూనిఫాం కూడా లేకుండా కనపడడంతో రూల్స్ పాటించాలని బుద్ధి చెప్పడానికి ఇలా చేశానని అన్నారు.

మరోసారి ఇలా కనపడకూడదని చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు, డ్రైవర్‌తో గుంజీలు తీయిస్తుండగా వీడియో తీసి నంద్‌గోకర్ తన ఫేస్‌బుక్ పేజీలోనూ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News