Karimnagar District: 'ఇక మా నాన్నతో ఉండను'.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిపై బాలుడి ఫిర్యాదు

  • కరీంనగర్‌లో జిల్లాలోని జమ్మికుంట పట్టణం శ్రీకృష్ణా కాలనీలో ఘటన
  • తన తండ్రి పీకలదాకా తాగొచ్చి కొడుతున్నాడని ఫిర్యాదు
  • తనను హాస్టల్‌లో చేర్పించాలని వినతి

పీకలదాకా తాగి ఇంటికి వచ్చి తమను నానా ఇబ్బందులకు గురి చేస్తోన్న తన తండ్రిపై ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఘటన కరీంనగర్‌లో జిల్లాలోని జమ్మికుంట పట్టణం శ్రీకృష్ణా కాలనీలో చోటు చేసుకుంది. తన తండ్రి శ్రీనివాస్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి తమను కొడుతున్నాడని సుమారు పదేళ్ల వయసున్న బాలుడు శశికుమార్.. జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన తండ్రి ఈ రోజు కూడా తాగి ఇంటికి వచ్చి తనతో పాటు తన ఇంట్లో వారిని చావగొట్టాడని చెప్పాడు. తండ్రి వేధింపులు భరించలేకపోతున్నామని, ఇక తండ్రితో ఉండలేమని ఆ బాలుడు చెప్పాడు. తాను తన తాగుబోతు తండ్రి వల్ల చదువుకోలేకపోతున్నానని, తనను హాస్టల్‌లో చేర్పించాలని పోలీసులను కోరాడు. 

Karimnagar District
child
father
Police
  • Loading...

More Telugu News