adinarayana reddy: నాపై విజ‌య‌సాయిరెడ్డివి పిచ్చి ప్రేలాప‌న‌లు!: ఏపీ మ‌ంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి

  • జ‌గ‌న్ మాదిరి దోపిడీ చేయాల‌న్న ఆలోచ‌న నాకు లేదు
  • సీఎం కార్యాలయ అధికారులపై విమర్శలెందుకు చేస్తున్నారు?
  • అభివృద్ధి విషయంలో సచివాలయంలో బహిరంగ చర్చకు సిద్ధమా?

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌నపై పిచ్చి ప్రేలాప‌న‌లు చేశారని, త‌నకు జ‌గ‌న్ మాదిరిగా దోపిడీ చేయాల‌న్న ఆలోచ‌న లేద‌ని ఏపీ మ‌ంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అన్నారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా జ‌గ‌న్‌ను బీజేపీ దగ్గరకు రానివ్వదని, కేసుల నుంచి బయట పడేయదని జోస్యం చెప్పారు. వైఎస్ కుటుంబ చరిత్ర ఏంటో, త‌న‌ కుటుంబ చరిత్ర ఏంటో తేల్చుకుందామా? అని స‌వాల్ విసిరారు.

సీఎం కార్యాలయ అధికారులపై కూడా వైసీపీ నేత‌లు అన‌వ‌స‌ర‌ విమర్శలు చేస్తున్నార‌ని మ‌ంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి విరుచుకుప‌డ్డారు. అభివృద్ధి విషయంలో సచివాలయంలో బహిరంగ చర్చకు సిద్ధమా? అని వైసీపీకి స‌వాలు విసిరారు.

adinarayana reddy
vijaya sai reddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News