anil ravipudi: బాలకృష్ణ తదుపరి చిత్రం దర్శకుడిగా అనిల్ రావిపూడి?

  • 'జై సింహా'తో హిట్ కొట్టిన నిర్మాత
  • బాలకృష్ణతో మరో మూవీ చేయాలనే ఉద్దేశం 
  • అనిల్ రావిపూడిని ఒప్పించే ప్రయత్నం

బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన 'జై సింహా' విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ చేయవలసి వుంది. అయితే అందుకు ఇంకా సమయం ఉండటంతో, ఆయనతో మరో సినిమాను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో సి.కల్యాణ్ ఉన్నారట. ఈ విషయంపై ఆయన వినాయక్ ను కలవడం .. తనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని ఆయన చెప్పడం జరిగిపోయాయట.

 దాంతో అనిల్ రావిపూడిని సి.కల్యాణ్ సంప్రదించాడని అంటున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యం కలిగిన సినిమాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. 'పటాస్' .. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్ ' సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. అందువలన ఆయనను ఒప్పించడానికి సి.కల్యాణ్  ప్రయత్నిస్తున్నాడట. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.        

anil ravipudi
kalyan
  • Loading...

More Telugu News