Jagan: సీబీఐ కోర్టుకు హాజరైన జగన్

  • విచారణ కోసం హైదరాబాద్‌లో జగన్‌
  • రేపటి నుంచి తిరిగి కొనసాగనున్న పాదయాత్ర
  • తదుపరి విచారణ వచ్చేనెల 9కి వాయిదా

ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్ర ప్రకాశం జిల్లాకు చేరుకున్న విషయం తెలిసిందే. నిన్న కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి, కనిగిరి మండలాల్లో పాదయాత్ర కొనసాగించిన జగన్... ఈ రోజు అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌లో సీబీఐ కోర్టుకు హాజరై విచారణ ఎదుర్కున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 9కి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు పేర్కొంది. జగన్ కాసేపట్లో హైదరాబాద్ నుంచి తిరిగి ప్రకాశం జిల్లాకు బయలుదేరనున్నారు. రేపటి నుంచి మళ్లీ తన పాదయాత్ర కొనసాగిస్తారు.

Jagan
cbi
Hyderabad
corruption
  • Loading...

More Telugu News