priyanka chopra: నీరవ్ మోదీ ఉత్పత్తులకు ప్రచారకర్తగా బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా!

  • నీరవ్ మోదీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న ప్రియాంక
  • పీఎన్బీని ముంచేసి, చెక్కేసిన నీరవ్ 
  • ప్రచారకర్త బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రియాంక

పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసి చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. ఆయన ఉత్పత్తులకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నీరవ్ మోదీపై కేసులు నమోదైన నేపథ్యంలో ప్రచారకర్త బాధ్యతల నుంచి ఆమె తప్పుకుంది.

మరోవైపు సూరత్ లో ఉన్న ఆయనకు చెందిన రెండు సెజ్ లను ఈడీ సీజ్ చేసింది. దీంతో, అందులో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులు వీధినపడ్డారు. గత రెండు నెలల నుంచి జీతాలు కూడా అందకపోవడంతో, వీరంతా ఆందోళనకు దిగారు.

ఇదిలా ఉంచితే, క్వాంటికో టీవీ సిరీస్ చిత్రీకరణలో ప్రియాంక బిజీగా ఉంది. ఏప్రిల్ 28 నుంచి సిరీస్-3 ప్రసారం కానుంది. దీనికితోడు రెండు హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆమె నటించనుంది. 

priyanka chopra
nirav modi
brand ambassador
  • Loading...

More Telugu News