aadhar card: ఐదేళ్ల లోపు చిన్నారులకు నీలిరంగు ఆధార్ కార్డులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-6bd67a71e117689921c7bc7256742c83edba82e2.jpg)
- 'బాల్ ఆధార్' అని నామకరణం
- ఐదేళ్ల లోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదు
- ఐదేళ్లు దాటితే బయోమెట్రిక్ కచ్చితంగా అవసరం
ఐదేళ్ల లోపు చిన్నారులకు కొత్త ఆధార్ కార్డులను ఇవ్వనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆ సంస్థ తెలిపింది. చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డులు నీలిరంగులో ఉంటాయని తెలిపింది. దీనిని 'బాల్ ఆధార్' అని పిలుస్తారని పేర్కొంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదని, కానీ ఆ వయసు దాటితే బయోమెట్రిక్ కచ్చితంగా అవసరం అని పేర్కొంది.