Chandrababu: చంద్రబాబును విమర్శించడమంటే.. మోసం చేయడమే: బీజేపీ నేతలపై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ

  • ప్రభుత్వంలో ఉంటూనే ముఖ్యమంత్రిని విమర్శిస్తారా?
  • రాం మాధవ్ చెప్పినట్టు వ్యవహరిస్తున్నారన్న రామకృష్ణ
  • దేశ పటంలో ఏపీని లేకుండా చేయాలనుకుంటున్నారన్న చలసాని

తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే... ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడమనేది ముమ్మాటికీ మోసమేనంటూ బీజేపీ నేతలపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాం మాధవ్ చెప్పినట్టు రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

ఇదే సందర్భంగా ఏపీ బీజేపీ మంత్రులపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి బీజేపీ చాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. భారతదేశ పటంలో ఏపీని లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఏపీ కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు ఇద్దరూ వైదొలగాలని డిమాండ్ చేశారు. 

Chandrababu
cpi ramakrishna
chalasani srinivas
special status
BJP
Telugudesam
  • Loading...

More Telugu News