Ram Nath Kovind: వర్చువల్ రియాల్టీ ద్వారా క్రికెట్ ఆడిన రాష్ట్రపతి కోవింద్

  • వీఆర్ గేర్ ధరించి క్రికెట్ ఆడిన రాష్ట్రపతి
  • నవ్వులు చిందిస్తూ పక్కన ఉన్న సీఎం యోగి
  • రాష్ట్రపతి కూడా ఓపెనింగ్ చేశారన్న సెహ్వాగ్

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్రికెట్ బ్యాట్ పట్టారు. ఇటీవల జరిగిన ఒక ఈ-స్పోర్ట్ ప్రాడక్ట్ లాంచింగ్ కార్యక్రమానికి కోవింద్ తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు హాజరయ్యారు. ఈ ప్రాడక్ట్ (ఐబీ క్రికెట్) ద్వారా వర్చువల్ రియాల్టీలో క్రికెట్ ఆడే వీలుంది. ఈ సందర్భంగా యోగి సహా పలువురు నవ్వులు చిందిస్తుండగా... వీఆర్ గేర్ ను ధరించి క్రికెట్ ఆడారు రాష్ట్రపతి. దీనికి సంబంధించిన ఫొటోను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. 'వావ్.. గౌరవనీయులైన రాష్ట్రపతిగారు కూడా ఓపెనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అసలైన మజా వచ్చింది. ఐబీ క్రికెట్ ద్వారా మరెవరైనా సెహ్వాగ్ కావాలనుకుంటున్నారా?' అంటూ సరదాగా కామెంట్ పెట్టాడు. 

Ram Nath Kovind
yogi adityanath
veerendra sehwag
ib cricket
Cricket
virtual reality
  • Loading...

More Telugu News