snap chat: ఒక్క ట్వీట్ తో స్నాప్ చాట్ కు రూ.8,300 కోట్లు నష్టం!

  • ఇకపై స్నాప్ చాట్ వాడనని రియాలిటీ స్టార్ కైలీ జెన్నెర్ ట్వీట్
  • దాంతో స్నాప్ ఐఎన్ సీ షేర్లు పతనం
  • 1.3 బిలియన్ డాలర్లు తగ్గిపోయిన మార్కెట్ విలువ

ట్వీటా మజాకా... ఒకే ఒక్క ట్వీట్ తో భారీగా నష్టం వాటిల్లుతుందా...? అవును ఇప్పుడు ఇదే జరిగింది. స్నాప్ చాట్ మార్కెట్ విలువను 1.3 బిలియన్ డాలర్ల మేర కరిగించేసింది. ఇంతకీ ఈ ట్వీట్ చేసింది ఎవరంటే రియాలిటీ స్టార్ కైలీ జెన్నెర్. ఇక మీదట తాను స్నాప్ చాట్ ను వాడనంటూ జెన్నెర్ ట్వీట్ చేసింది.

గురువారం ఈ ట్వీట్ చేయగా స్పాన్ చాట్ పేరెంట్ కంపెనీ స్నాప్ ఐఎన్ సీ మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) పడిపోయింది. స్నాప్ ఐఎన్ సీ షేరు ధర ఆరు శాతానికి పైగా పతనమైంది. అయితే, తాను ఇప్పటికీ స్నాప్ ను ప్రేమిస్తున్నట్టు ఆమె తర్వాత మరో ట్వీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కైలీ జెన్నెర్ కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫోటో షేరింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్నాప్ చాట్ 2017 డిసెంబర్ క్వార్టర్లో అమెరికా మార్కెట్లో ఫేస్ బుక్ కంటే ఎక్కువ మందిని ఆకర్షించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News