god S*x and truth: 'జీఎస్టీ' సినిమాను వర్మ హైదరాబాదులోనే షూట్ చేశారట.. ఆధారాలున్నాయంటున్న పత్రిక!

  • హైదరాబాద్ లోనే షూట్ చేశారంటూ ఓ పత్రికలో కథనం
  • మియా మాల్కోవా హైదరాబాద్ వచ్చిందట
  • తమ వద్ద పక్కా ఆధారాలున్నాయంటున్న సదరు పత్రిక

ప్రముఖ సినీ నటుడు రామ్ గోపాల్ వర్మకు తన తాజా లఘు చిత్రం 'జీఎస్టీ' లేనిపోని కష్టాలను తెచ్చిపెట్టింది. ఓ న్యూస్ ఛానల్ డిస్కషన్ లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆయన హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా సినిమా మొత్తం విదేశాల్లోనే షూట్ చేశారని, తాను స్కైప్ ద్వారా కొన్ని సూచనలు మాత్రమే చేశానని వర్మ చెప్పారు.

మరోవైపు, ఇప్పుడు మరో విషయం సంచలనం రేకిత్తిస్తోంది. 'జీఎస్టీ' చిత్రాన్ని హైదరాబాదులోనే తెరకెక్కించారని ఓ ప్రతిక కథనాన్ని ప్రచురించింది. మియా మాల్కోవా కూడా హైదరాబాదుకు వచ్చిందని కథనంలో పేర్కొంది. వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పింది. హైదరాబాదులోని ఓ హోటల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపింది.

ఒకవేళ ఇదే నిజమైతే రామ్ గోపాల్ వర్మకు కష్టాలు తప్పనట్టే. ఎందుకంటే మన దేశంలో పోర్న్ సినిమాలు తీయడం నిషిద్ధం. మరోవైపు, షూటింగ్ జరిగిన హోటల్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 

god S*x and truth
gst
ram gopal varma
Hyderabad
shooting
mia malkova
  • Loading...

More Telugu News