Rajanikant: నాకెవరి రాజకీయ పాఠాలూ అక్కర్లేదు: రజనీకాంత్

  • అభిమానులతో సమావేశమైన తలైవా
  • క్రమశిక్షణే తన బలమన్న రజనీకాంత్
  • గెలుపోటముల గురించి ఆలోచన లేదని వెల్లడి

తన సమకాలీన నటుడు కమలహాసన్ రాజకీయ అరంగేట్రం చేసి 'మక్కళ్ నీది మయ్యమ్' పేరిట పార్టీ స్థాపించి, ప్రజల్లోకి వెళ్లిన వేళ, అదే అడుగులు వేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఉదయం తన అభిమానులతో చెన్నైలో ప్రత్యేకంగా సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

నిజాయతీ, క్రమశిక్షణే తనకు, తన కార్యకర్తలకూ బలమని చెప్పారు. గెలుపు, ఓటములను గురించి తాను ఆలోచించదలచుకోవడం లేదని, అవసలు ముఖ్యమే కాదని అన్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలు తెలుసుకునేందుకు అడుగులు వేయాలని రజనీకాంత్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.

Rajanikant
Kamal Haasan
Tamil Nadu
Fans
Meeting
  • Loading...

More Telugu News