Puja hegde: పూజాహెగ్డే 'ఫిట్‌నెస్' ఫీట్లు.. వీడియో వైరల్!

  • ఫిట్‌నెస్ సెంటర్‌లో అందాల భామ కసరత్తులు
  • సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్
  • వావ్...సూపర్బ్...సెక్సీ అంటూ నెటిజన్ల ట్వీట్లు

'ముకుంద', దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఉత్తరాది భామ పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ పొడగరి, సొగసరి మాత్రమే కాదు అభినయంలోనూ ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి మార్కులే కొట్టేస్తోంది. తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్‌గా మారుతోంది.

ఇక ఇండస్ట్రీలో నెలకొన్న పోటీ నేపథ్యంలో అందంతో పాటు ఫిట్‌నెస్‌కి కూడా హీరోయిన్లు చాలాకాలంగా ప్రాధాన్యతను ఇస్తున్నారు. మామూలుగా బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, ఆలియా భట్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ లాంటి భామలు ఫిట్‌నెస్ సెంటర్లలో తెగ ఫీట్లు చేసేస్తుంటారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లు సైతం వారి బాటలోనే నడుస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో ఫిట్‌గా ఉండటానికి పూజా హెగ్డే కూడా ఓ ఫిట్‌నెస్ సెంటర్‌లో తాను చేసిన ఫీట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన ఆమె ఫ్యాన్స్ తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు. వావ్...సూపర్బ్...సెక్సీ...అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Puja hegde
Instagram
Fitness
Samantha
  • Error fetching data: Network response was not ok

More Telugu News