New Delhi: 'మై డియర్ ఫ్రెండ్' అంటూ ఎల్లా గ్రేస్ ను దగ్గరకు తీసుకున్న నరేంద్ర మోదీ... వీడియో చూడండి!

  • రాష్ట్రపతి భవన్ వద్దకు కెనడా పీఎం
  • స్వాగతం పలికిన నరేంద్ర మోదీ
  • ఆయన పిల్లలందరికీ షేక్ హ్యాండ్
  • ఆపై గ్రూప్ ఫోటో

ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ కు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి, ముగ్గురు బిడ్డలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వారు కారు దిగగానే, ట్రూడోకు ఎదురెళ్లిన ప్రధాని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత ఆయన సతీమణి రెండు చేతులెత్తి నమస్కరించగా, ప్రతి నమస్కారం చేశారు.

ఆపై ట్రూడో పెద్ద కుమారుడు జేవియర్ వచ్చి మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తరువాత కుమార్తె ఎల్లా గ్రేస్ తన వద్దకు రాగా, 'మై డియర్ ఫ్రెండ్' అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. 2015లో కెనడా పర్యటనకు మోదీ వెళ్లినప్పుడు ఎల్లా గ్రేస్ ను కలిసి, ఆమె రెండు చెవులనూ పట్టుకుని మోదీ ఫోటో దిగగా, అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఇండియాకు రావాలని ఎల్లాను మోదీ కోరారు. ఇప్పుడు నాటి ఘటనను ఎల్లాకు గుర్తు చేసిన మోదీ, ఆపై ట్రూడో చిన్న కుమారుడు హడ్రియన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మోదీతో హర్డియన్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎల్లా గ్రేస్ సహకరించడం గమనార్హం. ఆపై వారంతా కలసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

New Delhi
Narendra Modi
Justin trudeau
Rashtrapati Bhavan
  • Error fetching data: Network response was not ok

More Telugu News