steve jobs: వేలానికి యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఉద్యోగ దరఖాస్తు

  • వచ్చే నెలలో బోస్టన్ లో వేలం
  • రూ.50,000 డాలర్లు పలుకుతుందని అంచనా
  • 1973లో స్టీవ్ జాబ్స్ చేసిన దరఖాస్తు అది

యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యోగానికి చేసుకున్న దరఖాస్తు ఒకటి వచ్చే నెలలో వేలానికి రానుంది. ఇది 50,000 డాలర్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. మన కరెన్సీలో సుమారు రూ.32 లక్షలు. ఒక్క పేజీలోనే ఉన్న ఈ దరఖాస్తు 1973వ సంవత్సరానికి చెందినది. పేరు స్టీవెన్ జాబ్స్, చిరునామా రీడ్ కాలేజీ అని అందులో ఉంది.

 బోస్టన్ కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్ దీన్ని వేలానికి ఉంచుతోంది. అయితే, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నదీ అందులో లేదు. స్టీవ్ జాబ్స్, అతని మిత్రుడు స్టీవ్ వొజ్నాయిక్ మూడేళ్ల తర్వాత 1976 ఏప్రిల్ 1న యాపిల్ కంపెనీని స్థాపించారు. స్టీవ్ జాబ్స్ కేన్సర్ కారణంగా 2011లో 56 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయారు.

steve jobs
apple
  • Loading...

More Telugu News