Narendra Modi: మోదీ రాకను అడ్డుకుంటామని హెచ్చరించిన తమిళనాడు జాక్టో-జియో

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమాఖ్య
  • ప్రధాని ప్రయాణించే మార్గాలను ముట్టడిస్తాం
  • మా డిమాండ్లను వెంటనే నెరవేర్చండి

ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటించే మార్గాలను ముట్టడిస్తామంటూ జాక్టో-జియో సమాఖ్య తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఏర్పాటు చేసుకున్న వేదికే జాక్టో-జియో. 15 సమస్యల సాధన కోసం గత ఏడేళ్లుగా ఈ సమాఖ్య సభ్యులు ఆందోళనలు చేపడుతున్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేయాలి, 7వ వేతన ఒప్పందంలో భాగంగా అందాల్సిన 21 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలి.. వంటి డిమాండ్లతో వారు ఆందోళన చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ సమాఖ్య నేతలు మాట్లాడుతూ, ప్రతిరోజూ తాము చేపడుతున్న ఆందోళనలను అడ్డుకుంటున్న పోలీసులు... తమను రాజారత్నం స్టేడియంకు తరలిస్తున్నారని... అలా కాకుండా తమను పుళల్ జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. రేపు ప్రధాని వెళ్లే మార్గాల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

Narendra Modi
jacro-jio
Tamil Nadu
  • Loading...

More Telugu News