Narendra Modi: ట్రూడోను చూడగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోదీ

  • తుది దశకు ట్రూడో పర్యటన
  • న్యూఢిల్లీలో కాలుపెట్టిన కెనడా ప్రధాని
  • స్వాగతం పలికిన ప్రధాని

పలు వివాదాలను పెనవేసుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియా పర్యటన తుది దశకు చేరుకుంది. నేడు ఆయన తన భార్య, పిల్లలతో సహా న్యూఢిల్లీకి చేరుకోగా, ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత పర్యటనలో తన చివరి అడుగును దేశ రాజధానిలో మోపిన ట్రూడోకు ఘన స్వాగతం లభించింది.

ఆయన్ను చూడగానే మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. నేడు ఇద్దరు నేతల మధ్యా చర్చలు సాగనున్నాయి. ఉగ్రవాదం సహా అన్ని విభాగాల్లో ఇండియా, కెనడాల మధ్య బలమైన బంధాన్ని తాము కోరుతున్నామని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న ఇండియా, కెనడాల వృద్ధి మిగతాదేశాలకు మార్గదర్శకమని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.

Narendra Modi
Justin Truadu
New Delhi
Welcome
  • Error fetching data: Network response was not ok

More Telugu News