Kajal Agarwal: నేను ఎక్కువగా ప్రేమించేది 'నటన'నే!: కాజల్

  • నేను కూడా కచ్చితంగా పెళ్లి చేసుకుంటా
  • సరైన సమయంలో నా పెళ్లి జరుగుతుంది
  • నేను ఎక్కువగా ప్రేమించేది నటననే

హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ సక్సెల్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇటీవల విడుదలైన 'అ!' చిత్రం కూడా హిట్ కావడంతో మరింత జోష్ లో ఉంది. ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ... పెద్దగా సక్సెస్ రాకపోవడంతో, పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇటీవలే ఓ చిన్నారికి కూడా జన్మనిచ్చింది.

ఈ నేపథ్యంలో, 'నీ పెళ్లి ఎప్పుడు?' అనే ప్రశ్న కాజల్ కు తరచుగా ఎదురవుతోంది. తాజాగా ఈ ప్రశ్నపై స్పందించిన ఈమె... తాను కూడా కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. సరైన సమయంలో తన పెళ్లి జరుగుతుందని చెప్పింది. వివాహం తర్వాత కూడా తాను సినిమాల్లో కొనసాగుతానని తెలిపింది. తాను అందరికన్నా, అన్నింటికన్నా నటననే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పింది. 

Kajal Agarwal
marriage
nisha agarwal
  • Loading...

More Telugu News