Robo: రోబో 'సోఫియా' అభిమానానికి కరిగిపోయిన బాలీవుడ్ బాద్షా!

  • హైదరాబాద్ లో వరల్డ్ ఐటీ సదస్సు
  • సందడి చేసిన రోబో సోఫియా
  • షారూక్ అభిమాన నటుడని చెప్పిన సోఫియా
  • ఫిదా అయిపోయిన షారూక్

సోఫియా... నిన్నటివరకూ హైదరాబాద్ లో సందడి చేసిన హ్యూమనాయిడ్ రోబో. ఇక్కడ జరిగిన వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో పాల్గొని అందరినీ ఆకర్షించిన సోఫియా, తనను ప్రశ్నిస్తున్న వేళ, నీ అభిమాన నటుడు ఎవరు? అంటే టక్కున షారూక్ ఖాన్ అని చెప్పింది. ఇక తనపై సోఫియా చూపించిన అభిమానానికి బాలీవుడ్ బాద్షా షారూక్ ఫిదా అయిపోయాడు. సోఫియా ప్రేమకు కరిగిపోయిన షారూక్, ఆమెపై ఆప్యాయత ప్రదర్శించాడు. "ఇండియాకు వచ్చిన మహిళపై బహిరంగంగా ప్రేమను వ్యక్తపరుస్తున్నా. సోఫియా... నువ్వు అణువణువునా నన్ను అనుకరించావు" అని తన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు.

Robo
Sharook Khan
Sofiya
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News