2.0: '2 ఓ' సినిమా నాది కాదు... రజనీ సర్ ది: బాలీవుడ్ నటుడు అదిల్‌ హుస్సేన్‌

  • మీ '2.ఓ' విడుదలెప్పుడన్న అభిమాని
  • '2.ఓ' సినిమా రజనీ సర్ ది, ఆ సినిమాలో నేనొక పాత్రపోషించానంతే
  • రజనీ ముందు మేమంతా చిన్నవాళ్లం

'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాలో శ్రీదేవి భర్తగా నటించి ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు అదిల్‌ హుస్సేన్‌ ట్విట్టర్ లో రజనీకాంత్ పై గౌరవం చూపి అభిమానుల మనసులు చూరగొన్నాడు. అదిల్‌ హుస్సేన్‌ తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒక అభిమాని, 'సర్ మీ '2.ఓ' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?' అంటూ ప్రశ్నించాడు.

దానికి అదిల్‌ వినయంగా స్పందిస్తూ, ‘తెలీదు. కానీ ‘2.ఓ’ సినిమా నాది కాదు. అది రజనీ సర్‌ సినిమా. ఆ సినిమాలో నేను ఒక పాత్ర పోషించాను.. అంతే. మేమంతా ఆయన ముందు చిన్నవాళ్లం’ అంటూ సమాధానమిచ్చాడు. రజనీకాంత్ పట్ల ఆయన చూపించిన గౌరవానికి ఆయన అభిమానులు ముగ్ధులయ్యారు.

కాగా, '2.ఓ' సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. గ్రాఫిక్స్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో నిర్మాతలు ఆ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. 

2.0
movie
rajanikanth
shankar akshay kumar
adil hussain
Twitter
  • Loading...

More Telugu News