China: మొబైల్ వ్యాలెట్లను వాడడంలో చైనాను దాటేసిన భారత్
- తేలికగా లావాదేవీలు జరిగిపోయే ఈ విధానం పట్ల భారతీయుల ఆసక్తి
- పెద్దనోట్ట రద్దుతో పుంజుకున్న మొబైల్ వ్యాలెట్ల వాడకం
- ఈ ఏడాది ప్రారంభానికి ఈ లావాదేవీలు ఒక ట్రిలియన్‌కు చేరిన వైనం
గతంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో చిల్లర కొరత ఏర్పడి ప్రజలు పెద్ద ఎత్తున మొబైల్ వ్యాలెట్లను వాడడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తేలికగా డబ్బుల లావాదేవీలు జరిగిపోయే ఈ విధానం పట్ల భారతీయులు ఇప్పుడు కూడా బాగానే ఆసక్తి చూపుతున్నారు. దీంతో మొబైల్ వ్యాలెట్ల ద్వారా నగదు లావాదేవీల విషయంలో చైనా, డెన్మార్క్‌లను భారత్ అధిగమించింది.
తాజాగా వెల్లడించిన ‘గ్లోబల్ డేటా’ గణాంకాల ప్రకారం.. భారత్‌లో మొబైల్ వ్యాలెట్ల ద్వారా నగదు లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి వచ్చింది. 2013లో 24 బిలియన్లుగా ఉన్న మొబైల్ వ్యాలెట్ నగదు లావాదేవీలు గతేడాది నాటికి 955 బిలియన్లకు చేరాయని తెలిసింది. ఈ ఏడాది ప్రారంభానికి ఈ లావాదేవీలు ఒక ట్రిలియన్‌కు చేరడం విశేషం.
ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూకే వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లకు పోటీగా భారత్ నిలుస్తోందట. క్యాష్, కార్డుల ద్వారా ఇన్నాళ్లు చెల్లింపులు చేసిన వారిలో గణనీయంగా మొబైల్ వ్యాలెట్ల వైపు ఆసక్తి చూపుతున్నారు.