vijaya sai reddy: అధికారులపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి: మంత్రి సోమిరెడ్డి

  • అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు 
  • గతంలో జగన్ కూడా అధికారులను బ్లాక్ మెయిల్ చేశారు
  • మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలది కూడా ఇదే తీరు
  • కేసులపై విచారణ ముమ్మరం అవుతున్నందుకే ఇలా చేస్తున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయ సాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ లపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి బినామీ లావాదేవీలు, డొల్ల కంపెనీల మాయాజాలం సృష్టికర్త అని అన్నారు. కేసులపై విచారణ ముమ్మరం అవుతున్నందుకే వైసీపీ నేతలు అధికారులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

అధికారులపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగన్మోహన్‌రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో జగన్ కూడా అధికారులను బ్లాక్ మెయిల్ చేశారని సోమిరెడ్డి మండిపడ్డారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలది కూడా ఇదే తీరని అన్నారు.

vijaya sai reddy
Andhra Pradesh
somireddy
  • Loading...

More Telugu News