cpi ramakrishna: 'రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి రండి'.. పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వానించిన సీపీఐ రామకృష్ణ

  • పవన్‌ కల్యాణ్‌ను కలిసి చర్చించిన సీపీఐ రామకృష్ణ
  • జేఎఫ్‌సీ సమావేశం నిర్వహించిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై చర్చ
  • వచ్చేనెల 1న గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామని ఇటీవలే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇటీవల సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవతో ఏర్పాటైన జేఎఫ్‌సీ భేటీలోనూ పాల్గొన్నారు. కాగా, ఈ రోజు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి వచ్చిన ఆయన... పవన్ కల్యాణ్‌తో కాసేపు పలు అంశాలపై ముచ్చటించారు.

జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ) సమావేశం నిర్వహించిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై పవన్‌తో రామకృష్ణ మాట్లాడారు. వచ్చేనెల 1న తాము గుంటూరులో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్‌ను రామకృష్ణ కోరారు. 

cpi ramakrishna
Pawan Kalyan
Jana Sena
Hyderabad
  • Loading...

More Telugu News