manohar parrikar: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌.. ఆపై అసెంబ్లీకి వచ్చి ప్రసంగిస్తోన్న మనోహర్‌ పారికర్‌

  • ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న పారికర్‌
  • ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చి బడ్జెట్‌ బిల్లు ప్రవేశపెడుతోన్న సీఎం
  • సంతోషకరమైన వార్త: గోవా డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో జాయినైన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఈ రోజు వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇది చాలా సంతోషకరమైన వార్త అని గోవా డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో అన్నారు. మనోహర్ పారికర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాక నేరుగా గోవాలోని ఆయన నివాసానికి వెళ్లారు.

అనంతరం వెంటనే ఆయన శాసనసభలో బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టడానికి రావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గోవా అసెంబ్లీ సమావేశంలో ప్రసంగిస్తున్నారు. పారికర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న సమయంలో ఆయన ఆరోగ్యస్థితిపై సర్వత్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఎన్నో పుక్లార్లు వచ్చాయి. 

manohar parrikar
goa
hospital
  • Loading...

More Telugu News