priyank chopra: ప్రియాంక చోప్రా డూప్లికేట్... ఇంటర్నెట్ లో ఫొటోలు వైరల్

  • అచ్చం ప్రియాంకలా ఉన్న మేఘాన్ మిలాన్
  • మోడల్ గా పని చేస్తున్న మేఘాన్
  • ఆశ్చర్యానికి గురవుతున్న నెటిజన్లు

బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. 'క్వాంటికో' సిరీస్ తో ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజాగా అచ్చం ప్రియాంకను పోలీనట్టుండే ఓ అమ్మాయి ఫొటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. మేఘాన్ మిలాన్ అనే మోడల్ ప్రియాంక మాదిరే ఉండటంతో... నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇద్దరూ ఒకేలా ఉన్నారంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్ కు చెందిన మేఘాన్ కు కూడా మోడల్ గా మంచి గుర్తింపే ఉంది. ట్విట్టర్ లో ఆమెను 14 వేల మంది, ఇన్స్ టాగ్రామ్ లో 66 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో కొన్ని అచ్చం ప్రియాంకలా ఉన్నాయి.

  • Loading...

More Telugu News