priyanka chopra: ప్రియాంక చోప్రా హాట్ ఫొటోలపై అసోం అసెంబ్లీలో పెను దుమారం!

  • టూరిజం శాఖ కోసం అర్ధనగ్నంగా కనిపించిన ప్రియాంక
  • రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పోస్టర్లు
  • మండిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

అసోం రాష్ట్ర పర్యాటక శాఖ కోసం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చేసిన హాట్ ఫొటో షూట్ చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఏకంగా అసోం అసెంబ్లీని కుదిపేసింది. క్లీవేజ్ షోతో కూడిన ఆమె ఫొటోలు రాష్ట్రం మొత్తం మీద అక్కడక్కడ దర్శనం ఇస్తుండటం పట్ల కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఆమె ధరించిన గౌన్ అసోం సంప్రదాయాలకు వ్యతిరేకమని... పర్యాటక ఆదాయం కోసం ప్రభుత్వం ఇంతగా దిగజారాలా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. నటీమణులు గౌరవంగా కనిపించాలే తప్ప... ఇలా అర్ధనగ్న ప్రదర్శనలు ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. టూరిజం బ్రాండ్ అంబాసడర్ గా వెంటనే ప్రియాంకను తొలగించాలని డిమాండ్ చేశారు.

అయితే, ఈ వ్యవహారాన్ని అసోం పర్యాటక మంత్రి హిమంత బిస్వా వెనకేసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని... ప్రియాంక ఫొటోల్లో అసభ్యత లేదని చెప్పారు. ఇది పర్యాటక రంగానికి చెందిన అంశమని, రాష్ట్రానికి విదేశీయులు కూడా వస్తుంటారని, వారిని ఆకర్షించాలంటే హీరోయిన్లు ఆకర్షణీయంగానే ఉండాలని తెలిపారు. అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులను ధరిస్తుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

priyanka chopra
assom tourism
photo shoot
cleavage show
  • Loading...

More Telugu News