Kangana: 'గీతాంజలి' బ్రాండ్ పై బాలీవుడ్ భామల రుసరుస!

  • కంపెనీ తమతో ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణ
  • ఒప్పంద కాలం పూర్తయినా తన ఫొటోలు వాడటంపై బిపాసా బసు సీరియస్
  • కాంట్రాక్టు రద్దు చేసుకునే యోచనలో ప్రియాంకా

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీ పేరు కూడా రావడంతో ఆయన నేతృత్వంలోని 'గీతాంజలి' జెమ్స్‌కు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు బిపాసా బసు, కంగనా రనౌత్‌లు ఇప్పుడు రుసరుసలాడుతున్నారు. అందుకు కారణం... కంపెనీ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన వారికి ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడమే. గీతాంజలి బ్రాండ్‌లు 'నక్షత్ర', 'గిలి'కి ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు బిపాసా, కంగనా గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.

'నక్షత్ర' బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కంగన వ్యవహరించింది. కానీ, ఒప్పందం ప్రకారం ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని కంపెనీ ఇవ్వలేదని ఆమె నటించిన క్వీన్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై లాంటి చిత్రాలకు ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి తెలిపారు. నక్షత్ర బ్రాండ్ కోసం 2016లో కంగనా ఒప్పందం కుదుర్చుకుంది.

మరోవైపు బిపాసా కూడా చిర్రెత్తిపోతోంది. గిలీ బ్రాండ్‌కి ఆమె ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ బ్రాండ్‌తో తన ఒప్పంద కాలం ముగిసిపోయిన తర్వాత కూడా కంపెనీ తన ఫొటోలను ప్రచారానికి వాడుకుందంటూ ఆమె ఫైర్ అవుతోంది. గిలి బ్రాండ్‌కు ప్రస్తుతం మరో బాలీవుడ్ భామ కృతి సనన్ ప్రచారం చేస్తోంది. ఇంకోవైపు ఇదే కంపెనీకి అంతర్జాతీయ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా సైతం కంపెనీతో తన కాంట్రాక్టును రద్దు చేసుకునేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాల గురించి తెలుసుకుంటున్నట్లు ఇప్పటికే చెప్పింది. ఇతర గీతాంజలి బ్రాండ్లయిన అస్మి, డి'డమాస్, సంగినిలకు సల్మాన్ ఖాన్, కరీనా కపూర్‌లు గతంలో ప్రచారకర్తలుగా వ్యవహరించారు

Kangana
Nakshatra
Kriti Sanon
Priyanka Chopra
Bipasha Basu
  • Loading...

More Telugu News