ramalay: అయోధ్య రైల్వే స్టేషన్‌ను రామాలయం మాదిరిగా నిర్మిస్తాం: రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా

  • అయోధ్యలో రైల్వే స్టేషన్‌ అభివృద్ధి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • ఈ రైల్వే స్టేష‌న్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయోధ్యను సందర్శించుకోవచ్చు
  • చాలా ఏళ్లుగా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు

అయోధ్యలో రైల్వే స్టేషన్‌ అభివృద్ధి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఆ ప్రాంతానికి వెళ్లి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స‌ద‌రు రైల్వేస్టేషన్‌ను రామాలయం నమూనాలో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ రైల్వే స్టేష‌న్ ద్వారా దేశంలోని భ‌క్తులు అంద‌రూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయోధ్యను సందర్శించే విధంగా అనుసంధానం చేయాల‌ని తాము భావిస్తున్న‌ట్లు చెప్పారు.

చాలా ఏళ్ల నుంచి అయోధ్య రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలన్న చర్చలు జరుగుతున్నాయని, ఈ రైల్వే స్టేష‌న్ నిర్మాణం పూర్తి కాగానే, రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమవుతుందని మనోజ్ సిన్హా తెలిపారు. ఈ రైల్వే స్టేష‌న్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.80 కోట్లు కేటాయిస్తోంది. 

  • Loading...

More Telugu News