Amy Jackson: ఈ ఏడాదిలోనే పెళ్లిపీటలెక్కనున్న ఎమీ జాక్సన్?

  • బాయ్‌ఫ్రెండ్ జార్జ్‌తో పెళ్లికి సన్నాహాలు?
  • తేదీ, వేదిక ఖరారు చేసే పనుల్లో బిజీ..
  • వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఎమీ 'రోబో 2.0'

మదరాసిపట్నం, 'ఐ' చిత్రాలతో సౌతిండియా ప్రేక్షకులకు దగ్గరైన బ్రిటీష్ భామ ఎమీ జాక్సన్ ఈ ఏడాది ఆఖర్లోనే పెళ్లిపీటలెక్కబోతుందనే వార్త వినిపిస్తోంది. ఈ బక్కపలచభామ తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పనయోటౌతో ప్రస్తుతం డేటింగ్‌ చేస్తోంది. అతను లివర్ పూల్‌లో ప్లేగ్రౌండ్ నైట్ క్లబ్ వ్యవస్థాపకుడు. వారిద్దరి ప్రేమాయణం, పెళ్లి ప్రణాళికల గురించి 'డీఎన్ఏ' పత్రిక అందించిన వివరాల ప్రకారం, ఎమీ గతేడాదే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అప్పట్లో కుదరలేదు. అందువల్ల ఎలాగైనా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కాలని ఆమె ఉవ్విళ్లూరుతోంది.

ఎట్టకేలకు ఎమీ-జార్జ్ తమ పెళ్లి గురించి ఓ ప్లాన్ వేసుకుంటున్నారు. పెళ్లి తేదీ, వేదికను ఖరారు చేసే పనిలో వారిద్దరూ ఉన్నారట. బ్రిటీష్ స్థిరాస్తి వ్యాపారి ఆండ్రియాస్ పనయోటౌ కుమారుడే జార్జ్. వీరికి విలాసవంతమైన హోటళ్ల వ్యాపారముంది. ఎమీ జాక్సన్ ప్రస్తుతం టీవీ సిరీస్ 'సూపర్ గర్ల్' షూటింగ్‌లో బిజీగా ఉంది. శంకర్ దర్శకత్వంలో ఆమె నటించిన రోబో 2.0 చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశముంది. మరోవైపు బాలీవుడ్‌లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న 'రాధే' చిత్రంలో ఎమీ హీరోయిన్‌గా నటించే అవకాశముందని బీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి.

Amy Jackson
George Panayiotou
Andreas Panayiotou
  • Loading...

More Telugu News