sai dharam tej: కిషోర్ తిరుమల ప్రాజెక్టు నుంచి తప్పుకున్న నాని .. ఆ ప్లేస్ లో సాయిధరమ్ తేజ్

  • నానితో చేద్దామనుకున్న కిషోర్ తిరుమల 
  • కథా కథనాల పట్ల నాని అసంతృప్తి 
  • ఆయన స్థానంలోకి సాయిధరమ్ తేజ్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి నాని తప్పుకున్నాడనేది తాజా సమాచారం. కథా కథనాల విషయంలో నాని చాలా మార్పులు .. చేర్పులు చెప్పాడట. తనదైన శైలిలో కిషోర్ తిరుమల ట్రై చేసినా నాని సంతృప్తి చెందలేదట .. దాంతో తాను చేయలేనంటూ సున్నితంగా తప్పుకున్నాడని అంటున్నారు.

 ఈ నేపథ్యంలో అదే కథను సాయిధరమ్ తేజ్ తో చేయడానికి మైత్రీ మూవీస్ వారు సిద్ధమవుతున్నారట. కథ విన్న వెంటనే సాయిధరమ్ తేజ్ ఒప్పుకున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన గోపీచంద్ మలినేనితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత కిషోర్ తిరుమలతో తేజు సినిమా పట్టాలెక్కనుంది.  

sai dharam tej
kishor tirumala
  • Loading...

More Telugu News