Paytm: క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు పేటీఎమ్ షాక్!

  • క్రెడిట్‌ కార్డు ద్వారా నగదు యాడ్‌ చేసుకుంటే గిఫ్ట్‌ ఓచర్లుగా మార్పు
  • ఓచర్లతో రీఛార్జ్‌ లేదా షాపింగ్
  • మండిపడుతున్న యూజర్లు

డిజిటల్ పేమెంట్ల రంగంలో దూసుకుపోతున్న పేటీఎమ్ తన యూజర్లకు షాకిచ్చింది. ఇకపై క్రెడిట్‌ కార్డుల ద్వారా వాలెట్‌లోకి నగదును యాడ్‌ చేస్తే వాటిని గిఫ్ట్‌ ఓచర్లుగా మార్చేస్తుంది. వీటిని కేవలం ఆ యాప్ లో మాత్రమే రీఛార్జ్ కి గాని లేదా షాపింగ్ కి గాని ఉపయోగించుకోవాలి. ఇకపై క్రెడిట్‌ కార్డు ద్వారా యాడ్‌ చేసిన నగదును ఇతరులకు గాని లేదా బ్యాంకులకు గాని తరలించడానికి వీలులేదు.

 దీనిపై పేటీఎం యూజర్లు ట్విట్టర్ లో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన పేటీఎం.. ఇకపై క్రెడిట్‌ కార్డు ద్వారా మీరు లావాదేవీలు జరిపితే అది పేటీఎం గిఫ్ట్‌ ఓచర్లుగా మారతాయి. ఈ ఓచర్లతో రీఛార్జ్‌ లేదా షాపింగ్ మాత్రమే చేసుకోవచ్చు. అలాగే పేటీఎం అంగీకరించే అవుట్‌లెట్లు, మర్చంట్ ల చెల్లింపులకు వాడుకోవచ్చని తెలిపింది.

Paytm
PaytmMall
Twitter
creditcard
  • Loading...

More Telugu News