varun tej: 'ఘాజీ' దర్శకుడితో వరుణ్ తేజ్ 'అహం బ్రహ్మాస్మి'

  • సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 
  • 'గ్రహాంతరవాసి'కి సంబంధించిన కథ 
  • కంటెంట్ పై బలమైన నమ్మకంతో వరుణ్

'ఘాజీ' సినిమాతో సంకల్ప్ రెడ్డి తెలుగు తెరకి పరిచయమయ్యాడు. సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో తెలుగులో తొలిసారిగా ఈ సినిమాను తెరకెక్కించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ లో ఆయన తెరపై భారీతనాన్ని చూపించిన తీరు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో ఆయన మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ సారి ఆయన 'గ్రహాంతరవాసి'కి సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

 ఈ సినిమాకి 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. కంటెంట్  .. టైటిల్ విభిన్నమైనవిగా కనిపిస్తున్నా, వాటి మధ్య సంబంధం ఉంటుందని అంటున్నారు. 'ఫిదా' .. 'తొలిప్రేమ' వంటి హిట్స్ తో వరుణ్ తేజ్ మాంచి జోరుమీదున్నాడు. కంటెంట్ పరంగా చూసుకుంటే 'కంచె' తరువాత ఆయన చేస్తోన్న మరో వైవిధ్యభరితమైన చిత్రంగా 'అహం బ్రహ్మాస్మి'ని గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.      

varun tej
sankalp reddy
  • Loading...

More Telugu News