madhavan: మళ్లీ మాధవన్, గౌతమ్ మీనన్ కాంబో!

  • గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్
  •  'చెలి' తరువాత చేస్తోన్న సినిమా
  •  స్నేహమే ప్రధాన కథాంశం

తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి క్రేజ్ వుంది. అలాగే స్టార్ హీరోగా మాధవన్ కి కూడా ఇమేజ్ వుంది. గతంలో .. అంటే 17 సంవత్సరాల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మిన్నాలే' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోనూ 'చెలి' పేరుతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ సినిమా మాధవన్ కి మంచి గుర్తింపు లభించేలా చేసింది.

మళ్లీ ఇన్నాళ్లకి ఈ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'విన్నై తాండి వరువాయా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది 'ఏ మాయ చేశావే' సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. స్నేహానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. మాధవన్ తో పాటు మరో ఇద్దరు హీరోలను ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News