Donald Trump: ఆసుపత్రి నుంచి నేరుగా డిస్కోకు వెళ్లి ఎంజాయ్ చేసిన ట్రంప్, మెలానియా!

  • ఫ్లోరిడా కాల్పుల ఘటన బాధితులకు పరామర్శ
  • అటుపై డిస్కోకు వెళ్లిన ట్రంప్ దంపతులు
  • ట్రంప్ తో కబుర్లు చెబుతూ కనిపించిన మెలానియా

తన భార్య మెలానియాతో ట్రంప్ కు విభేదాలు పెరిగాయని, భర్తకు ఆమె దూరంగా ఉంటోందని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన భార్యను తీసుకుని డిస్కోలో నైట్ పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇటీవల ఫ్లోరిడాలోని ఓ స్కూల్ లో మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు బ్రోవార్డ్ హెల్త్ ఆసుపత్రికి వెళ్లిన ట్రంప్, మెలానియాలు బాధితులతో కాసేపు మాట్లాడారు.

ఆ తర్వాత అక్కడి నుంచి వారిద్దరూ మారా లాగో రిసార్ట్‌లో ఉన్న స్టూడియో 54లో జరుగుతున్న డిస్కో పార్టీకి వెళ్లి కాసేపు గడిపారు. ఆ సమయంలో మెలానియా తన భర్తకు చాలా దగ్గరగా ఉండటం, చొరవగా ఆయన చేతిని తీసుకుని తన చేతుల్లో వేసుకుని కూర్చోవడం చూసిన వాళ్లకు వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని అర్థమైంది. ఇద్దరూ జాలీగా కబుర్లు చెప్పుకుంటుండగా, అదే పార్టీలో ఉన్న కొందరు ఆ దృశ్యాలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Donald Trump
Melania Trump
Florida
Firing
Hospital
Disco
  • Error fetching data: Network response was not ok

More Telugu News