Road Accident: వైజాగ్ లో రోడ్డు ప్రమాదం... ట్రావెల్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు!

  • ఎన్ఏడీ జంక్షన్ లో ప్రమాదం
  • రోడ్డు దాటుతున్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు
  • 50 మందికి గాయాలు, పది మంది పరిస్థితి విషమం

విశాఖపట్టణంలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న లారీని, విజయవాడ నుంచి విశాఖ వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 50 మందికి గాయాలు కాగా, పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. యాక్సిడెంట్ కారణంగా ఎన్‌ఏడీ జంక్షన్‌ లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Road Accident
travels bus
Vizag
Visakhapatnam District
  • Loading...

More Telugu News