somireddy: జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి: మంత్రి సోమిరెడ్డి

  • ‘కేంద్రం’పై టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తాననడం విడ్డూరం
  • జగన్ మా మిత్ర పక్షం కాదు
  • ఓ అవినీతి పరుడితో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేము: సోమిరెడ్డి

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం పెడితే తమకు మద్దతిస్తానని జగన్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ తమ మిత్రపక్షం కాదని, ఓ అవినీతిపరుడితో కలిసి వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాసం పెడితే టీడీపీ మద్దతు ఇవ్వాలని, ఒకవేళ టీడీపీ ఆ పని చేస్తే తాము మద్దతు ఇస్తామని జగన్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే.

somireddy
Telugudesam
  • Loading...

More Telugu News