sidda ramaiah: నరేంద్రమోదీ ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదు: సిద్ధరామయ్య

  • మోదీ.. ప్రధానమంత్రిగా కొనసాగేందుకు అర్హుడే కా‌దు
  • దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి
  • అవేమీ పట్టనట్లు ప్ర‌ధాని వ్యవహరిస్తున్నారు
  • రాజకీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వ్యాఖ్యలు చేయ‌డం సరికాదు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో జ‌రిపిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అస‌లు మోదీ ప్రధానమంత్రిగా కొనసాగేందుకు అర్హుడే కాద‌ని సిద్ధరామయ్య అన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, అవేమీ పట్టనట్లు ప్ర‌ధాని వ్యవహరిస్తున్నారని విమ‌ర్శించారు. అంతేకాకుండా మోదీ బాధ్యాతయుతమైన ప్రకటనలు చేయకుండా, రాజకీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వ్యాఖ్యలు చేయ‌డం సరికాదని అన్నారు. 

sidda ramaiah
Karnataka
Narendra Modi
  • Loading...

More Telugu News