agni-2: అణ్వస్త్రాలను మోసుకెళ్లే అగ్ని-2 పరీక్ష విజయవంతం

- స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2
- ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగం
- 2,000 నుంచి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2 క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ రోజు ఉదయం విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణి అణ్వస్త్రాలను ఉపరితలం నుంచి ఉపరితలం పైకి దూసుకెళ్లి 2,000 నుంచి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది 20 మీటర్ల పొడవు, 16 టన్నుల బరువు ఉండి, సుమారు వెయ్యి కిలోల బరువైన వార్‌హెడ్ ను మోసుకుపోగలదు.
