charan: రాజమౌళి మల్టీస్టారర్ లో చరణ్ జోడీగా రాశిఖన్నా?

  • స్లిమ్ గా మారిపోయిన రాశిఖన్నా
  • యూత్ లో పెరుగుతోన్న క్రేజ్ 
  • చేజారిన 'రంగస్థలం' అవకాశం
  • రాజమౌళి సినిమాలో ఛాన్స్  

'జై లవకుశ' సినిమాతోను .. 'తొలిప్రేమ' సినిమాతోను రాశిఖన్నా విజయాలను అందుకుంది. అంతేకాదు, స్లిమ్ గా మారిపోయి యూత్ మనసులు దోచేసుకుంది. దర్శక నిర్మాతలు తమ తదుపరి సినిమాల్లో ఆమె పేరును పరిశీలించేలా చేయగలిగింది. 'రంగస్థలం' సినిమాలో చరణ్ సరసన ముందుగా రాశి ఖన్నానే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ వేషాన్ని సమంతా తన్నుకుపోయింది.

 దాంతో చరణ్ జోడీగా ఎప్పుడు ఛాన్స్ తగులుతుందా అనే ఆశతో రాశి ఖన్నా ఎదురుచూస్తోంది. త్వరలోనే ఆమె నిరీక్షణ ఫలించనున్నట్టు సమాచారం. చరణ్ .. ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ జోడీగా రాశి ఖన్నాను తీసుకోనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే .. చరణ్ సరసన నటించాలనే ఆశతో పాటు, రాజమౌళి సినిమాలో చేయాలనే ఆమె కల కూడా నిజమైనట్టే అవుతుంది.       

charan
rasi khanna
  • Loading...

More Telugu News