Chandrababu: అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి!: చంద్రబాబుకి సీపీఐ రామకృష్ణ లేఖ

  • విభజన హామీల అమలు తదితర అంశాలపై చర్చ జరగాలి
  •  వైసీపీ అసలు ప్రతిపక్ష పార్టీలా లేదన్న బాబు 
  • అఖిల సంఘాల సమావేశం పట్ల చంద్రబాబు మొగ్గు 

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిన నేపథ్యంలో పోరాడాల్సిన అవశ్యకత ఉందని చెబుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విభజన హామీల అమలు తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనిపై చంద్రబాబు స్పందించాల్సి ఉంది.

కాగా, మరోవైపు ఈ రోజు జరుగుతోన్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశం కాదని, అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. వైసీపీ అసలు ప్రతిపక్ష పార్టీలా వ్యవహరించడం లేదని, మిగిలిన పార్టీలకు అంతగా ప్రాతినిధ్యంలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే అఖిల సంఘాలతో సంప్రదింపులు జరిగితే బాగుంటుందని తెలిపారు. 

Chandrababu
Andhra Pradesh
cpi ramakrishna
Union Budget 2018-19
Special Category Status
  • Loading...

More Telugu News