Chandrababu: రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది: చ‌ంద్ర‌బాబు

  • మనకు జరిగిన అన్యాయంపై పోరాడాల్సిందే 
  • ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది
  • విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తే సరిపోతుందని అనుకోవద్దు
  • అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు చేకూరుతాయా?

రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... మనకు జరిగిన అన్యాయంపై పోరాడాల్సిందేన‌ని చెప్పారు. విప‌క్షాలు చేస్తోన్న విమర్శల‌కు ప్రతివిమర్శలు చేస్తే సరిపోతుందని అనుకోవద్దని, ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పాల‌ని సూచించారు.

కాగా, అవిశ్వాసం పెడితే రాష్ట్ర ప్రయోజనాలు చేకూరుతాయా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఒత్తిడి పెంచితే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని చెప్పారు. హోదాతో సమానంగా ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామ‌ని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పాటు మనం పన్నులు కడుతున్నామ‌ని, విభజన వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని అడుగుతున్నామ‌ని తెలిపారు.        

  • Loading...

More Telugu News