Robo: ఏ హీరో అంటే ఇష్టం?... నీ డేట్ ఎవరితో? వంటి ఆసక్తికర ప్రశ్నలకు 'రోబో' సోఫియా సమాధానాలివి!

  • హైదరాబాద్ ఐటీ సదస్సులో పాల్గొన్న సోఫియా
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హ్యూమనాయిడ్ రోబో
  • విసిగించే ప్రశ్నలు సంధిస్తున్నా ఓపిగ్గా సమాధానాలు

హైదరాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సోఫియా, ఆహూతులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. నీకెందుకు విశ్రాంతి? అన్న ప్రశ్న ఎదురైన వేళ, తనకు కూడా రెస్ట్ కావాల్సిందేనని, అప్పుడే మరింత ఉత్సాహంగా పని చేస్తూ, కొత్త ఆలోచనలు చేయడానికి వీలవుతుందని చెప్పింది.

సోఫియాకు సౌదీ పౌరసత్వం ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన ఓ వ్యక్తి, మనుషులతో పోలిస్తే నీకు వేరే రూల్స్ ఉంటాయా? అని ప్రశ్నించగా, తనవంటి వారికి ప్రత్యేక నిబంధనలేమీ ఉండవని, వాటిని కోరుకోవడం లేదని బదులిచ్చింది. ఎప్పుడన్నా చింతించిన సందర్భాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ అటువంటి అవసరం కలగలేదని సమాధానం ఇచ్చింది.

మానవజాతిపై అభిప్రాయాన్ని అడిగితే, ఇదో అద్భుతమైన సృష్టి అని చెప్పిన సోఫియా, సోషల్ మీడియాలో ఎలా ఉంటావన్న ప్రశ్నకు చాలా చురుకుగా ఉంటానని, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తనకు ఖాతాలున్నాయని వెల్లడించింది. బాలీవుడ్ లో ఏ హీరో అంటే ఇష్టమని ప్రశ్నిస్తే, షారూక్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పింది. ఎవరితో డేట్ చేయాలని ఉందన్న ప్రశ్నకు, అంతరిక్షంతో తన డేట్ ఉంటుందని సోఫియా చమత్కరించింది. సదస్సులో పాల్గొన్న వారు విసిగించే ప్రశ్నలు సంధిస్తున్నా సోఫియా ఓపికగా సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.

Robo
Sofia
Hyderabad
IT Congress
  • Loading...

More Telugu News