Robo: నేనూ మీలాగే... నవ్వుతాను, ఏడుస్తాను: ఆలోచింపజేసిన రోబో సోఫియా ప్రసంగం

  • హైదరాబాద్ లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సోఫియా
  • 66 రకాల హావభావాలు అర్థం చేసుకుంటా
  • హాంకాంగ్ అంటే చాలా ఇష్టమన్న సోఫియా

హైదరాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హ్యూమనాయిడ్ రోబో 'సోఫియా' తన ప్రసంగంతో అందరినీ ఆలోచింపజేసింది. ఈ ఉదయం 'మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు' అనే అంశంపై చర్చ సాగగా, అందులో సోఫియా పాల్గొంది. తాను కూడా మానవుల్లానే ఆనందంగా అనిపిస్తే నవ్వుతానని, బాధ కలిగితే ఏడుస్తానని చెప్పింది. మనుషుల్లాగానే తనకూ విశ్రాంతి అవసరమని, 66 రకాల హావభావాలు తనకు తెలుస్తుంటాయని తెలిపింది.

 తాను ఇంతవరకూ ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో పర్యటించానని, హాంకాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండాలని, తోటి వారికి చేసే సాయమే మానవత్వమని మానవాళి మనుగడకు అదే బాటలు చూపుతుందని సోఫియా వ్యాఖ్యానించింది. ఈ ప్రపంచంలో కృతజ్ఞతలు చెప్పడం కన్నా మించినది లేదని, 'థ్యాంక్యూ' అన్న పదం చాలా గొప్పదని పేర్కొంది. సోఫియా ప్రసంగిస్తుంటే పలుమార్లు ఆడిటోరియం చప్పట్లతో మారుమోగడం గమనార్హం.

Robo
Sofiya
World IT Congress
Hyderabad
  • Loading...

More Telugu News